బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. తొలిరోజే.. థియేటర్లలో సింహ గర్జన చేసిన షారుక్.. సినిమా విడుదలైన 26 రోజుల తర్వాత కూడా ఆ రీసౌండ్ను కంటిన్యూ చేస్తున్నాడు. ఒకటి.. రెండు.. మూడు.. వందల కోట్లు కొల్లగొట్టేస్తూ.. అత్యంత వేగంగా వెయ్యికోట్లను కూడా దాటేశాడు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 27 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 517.50 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 1002 – 1003 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. దీంతో రూ. 1000 కోట్లు మార్కును దాటిన చిత్రంగా మరో రికార్డును సాధించింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న షారూఖ్.. ఈ మధ్య కొంత గ్యాప్ తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ‘పఠాన్’తో వచ్చి తన ఫ్యాన్స్‌నే కాకుండా సినీ అభిమానులు పెద్ద ఫీస్టే ఇచ్చాడు. ఈ సినిమాకు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. రిలీజ్ స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ‘పఠాన్’పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 – 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు అనుగుణంగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 26 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 515.67 కోట్లు నెట్, రూ. 1000 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా ఈ ఘనతను అందుకున్న ఐదో సినిమాగా నిలిచింది. దీనికంటే ముందు ‘దంగల్’, ‘బాహుబలి 2’, RRR, ‘కేజీఎఫ్ 2’ ఉన్నాయి. ఇప్పుడు ‘పఠాన్’ మూవీ ఈ జాబితాలో నాలుగో స్థానానికి చేరాలంటే మాత్రం మరో 200 కోట్లు వరకూ రాబట్టాల్సి ఉంటుంది.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. విశాల్ శేఖర్ దీనికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించాడు.