Pathaan box office collections: పఠాన్ సునామీకి రికార్డులు బ్రేక్...!! - Telugu News - Mic tv
mictv telugu

Pathaan box office collections: పఠాన్ సునామీకి రికార్డులు బ్రేక్…!!

February 1, 2023

pathaan

ఒక సినిమా బిగ్ హిట్ అయ్యిందంటే..దానికి సీక్వెల్ తప్పకుండా ఉంటుంది. బాహుబలి, కేజీఎఫ్ వంటి చిత్రాలు సీక్వెల్లో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలు సాధించిన రికార్డులను బ్రేక్ చేసింది బాలీవుడ్ మూవీ పఠాన్. సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ మూవీ రికార్డుల ముందు బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాలు కూడా డీలా పడిపోయాయి. దీన్ని బట్టి చూస్తే పఠాన్ మూవీ ఏ రేంజ్‎లో ప్రేక్షకులను మెప్పించిందో అర్థమౌతోంది.

బాలీవుడ్ దర్శక్షుడు సిద్దార్థ ఆనంద్, జాన్ అబ్రహం విలన్, షారుక్ ఖాన్ హీరో, దీపికా పదుకొనే హీరోయిన్ ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే రూ. 542కోట్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలపై ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పుడు ఈ మూవీ భారీ సక్సెస్ ను అందుకోవడంతో…అభిమానులంతా సీక్వెల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంపై ఈ మూవీ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ…ప్రతి మూవీ మేకర్ వలే నేను కూడా షారుఖ్ ఖాన్ తో ఒక మూవీ చేస్తే చాలు అనుకున్నారు. ఇప్పుడు ఆ కోరిక పఠాన్ మూవీతో తీరిపోయింది. షారుక్ ఖాన్ అద్భుతమైన కానుక ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సిక్వెల్ ఉంటుందా లేదా అనేది చెప్పలేను అంటూ చెప్పుకొచ్చాడు సిద్థార్థ్. మొత్తానికి పఠాన్ సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.