బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. విడుదలైన కొద్దిసేపటికే తుఫానులా వచ్చి పాతరికార్డులన్నింినీ తుడిచిపెట్టేసింది. దగల్, కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీలను కూడా పక్కకు నెట్టేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ తన పాత రికార్డును తిరగరాసారు. రిపబ్లిక్ డేకు ఒకరోజు ముందు విడుదలైన ఈ సినిమా తొలిరోజు 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా ఈ సినిమా విడుదలై 22రోజులు పూర్తి చేసుకుంది. అయినా కూడా భారీ వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సునామీ స్రుష్టిస్తోంది. మూడవ సోమవారం ఈ మూవీ రూ. 4.20కోట్లు వసూలు చేసింది. మంగళవారం రూ. 5.6కోట్లు రాబట్టింది.
రూ. 500కోట్లు దాటిన పఠాన్ కలెక్షన్స్
బుధవారం నాటి లెక్కల ప్రకారం పఠాన్ 3.50కోట్లు రాబట్టింది. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా రూ. 502.35కోట్ల కలెక్షన్లను రాబట్టింది. సిద్థార్థ్ ఆనందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వసూళ్ల పరంగా యష్ నటించిన కేజీఎఫ్ 2 ను వెనక్కు నెట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ చిత్రంగా రికార్డు క్రియేట్ ఛాన్స్ లేకపోలేదు.
కాగా షారుఖ్ పఠాన్ మూవీ హిందీలో 510.99కోట్లు సంపాదించిన ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి2ను కూడా క్రాస్ చేయనుంది. ఇప్పుడు పఠాన్ 4వ వారంలోకి అడుగుపెట్టింది. ఇంకా థియేటర్లలో నిలదొక్కుకుంటే షారుఖ్ ఖాన్ కు పెద్ద విజయం దక్కినట్లే.