ఘోరం.. ఆక్సిజన్ అందక మరో 25 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఘోరం.. ఆక్సిజన్ అందక మరో 25 మంది మృతి

April 23, 2021

Patient died in Gangaram hospital due to scarcity of oxygen

కరోనా సెకెండ్ వేర్ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఫస్ట్ వేవ్‌ నుంచి ప్రభుత్వాలు గుణపాఠాలు తీసుకోకపోవడంతో విలువైన ప్రాణాలు గాలిలో కలసిపోతున్నా. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆక్సిజన్ లీకై 25 మంది కరోనా రోగులు చనిపోయిన విషాదాన్ని మరకమకముందే ఢిల్లీలో మరో దారుణం జరిగింది.

సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో 25 మంది రోగులు మృత్యువాత పడ్డారు. గత 24 గంటల వ్యవధిలో ప్రాణవాయువు నిల్వలు లేకపోవడతో మరణాలు సంభవించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆక్సిజన్ కొరత వల్ల చాలామంది పేషంట్లకు సరైతన ప్రెజర్ లేకుండా ఆక్సిజన్ అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కో పేషంటుకు గంటసేపు కూడా ఆక్సిజన్ పెట్టడం లేదని, వెంటిలేటర్లు, బీపీఏపీ పరికరాలు కూడా మొరాయించాయని బాధితులు ఆరోపిస్తున్నారు.

దీనికి కేంద్రానికే బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో 500 మంది కరోనా రోగులుండగా, 150 మందికి ఆక్సిజన్ కావాలన వైద్యులు చెప్పారు. దేశ రాజధానిలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా రాష్ట్రాలో పరిస్థితిని అంచనా వేయొచ్చని, దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని విపక్షాలు ఆరోపిస్తున్నారు. ప్రజలు కట్టిన సొమ్మంతా పెట్టుబడిదారులకు కట్టబెడుతూ ప్రజలకు వైద్యసేవలు అందించకుండా చంపేస్తున్నారని మండిపడుతున్నారు.