గుంటూరులో కరోనా రోగి ఆత్మహత్యాయత్నం..  - MicTv.in - Telugu News
mictv telugu

గుంటూరులో కరోనా రోగి ఆత్మహత్యాయత్నం.. 

August 14, 2020

కరోనా సోెకిందంటే చాలు చాలా మంది మానసిక ఆందోళనకు గురౌతున్నారు. వైద్యులు ధైర్యం చెప్పినా పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. ఏపీలో అయితే ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలోనూ ఓ కరోనా రోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రి భవనంపై నుంచి దూకి చనిపోవాలని అనుకున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

చినకాకానిలోని ఎన్నారై ఆసుపత్రిలో 66 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడ్డాడు. కొన్ని రోజులుగా అతడు అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడి భరించలేక అతడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన సిబ్బంది అత్యవసర విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోగి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.