సర్జరీ చేయించుకుంటూ ఏం చేశాడంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

సర్జరీ చేయించుకుంటూ ఏం చేశాడంటే..

September 4, 2017

మనకు డాక్టర్లు ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? మత్తుమందు ప్రభావంతో చలనం లేకుండా ఉండిపోతాం. చిన్న ఆపరేషన్ అయితే కాస్త మెలకువ ఉంటుంది. అంతేగాని కాళ్లూ, చేతులూ ఆడించం. . పాటలు కూడా పాడం. అసలు కదలనే కదలం.  కానీ అమెరికాకు చెందిన మ్యూజిక్ టీచర్ డాన్ ఫాబియో మాత్రం తన రూటే సపరేట్ అన్నాడు. ఓ పక్క డాక్టర్లు తన మెదడులోని కణితిని తొలగించడానికి పెద్ద ఆపరేషన్ చేస్తుండగా ఫాబియో ఏ మాత్రం పట్టించుకోకుండా తనకిష్టమైన శాక్సో ఫోన్ వాయిస్తూ వెళ్లాడు. దీంతో న్యూయార్క్ లోని ఆ ఆపరేషన్ థియేటర్ కాస్తా సంగీత కచేరీగా మారిపోయింది. వైద్యులు కణితిని విజయవంతంగా తొలగించేంతవరకు ఫాబియో శాక్సోఫోన్ వాయిస్తూనే ఉన్నాడు.  సర్జరీ తర్వాత కూడా వాయించాడు. తనకు సంగీతమంటే ప్రాణమని, కీలకమైన ఆపరేషన్ సమయంలో శాక్సోఫోన్ తనకు ఊరటనిస్తుందని ఫాబియో చెప్పడంతో వైద్యులు కాదనలేకపోయారట. ఫాబియో ప్రస్తుతం పూర్తిగా కోలుకుని చక్కగా పిల్లలకు సంగీత పాఠాలు నేర్పుతున్నాడు.