నిమ్స్ డాక్టర్‌పై రోగి బంధువుల దాడి.. (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

నిమ్స్ డాక్టర్‌పై రోగి బంధువుల దాడి.. (వీడియో)

May 20, 2019

నిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్‌పై ఓ రోగి బంధువులు దాడి చేశారు. సరైన వైద్యం అందించడం లేదంటూ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డు వద్ద నానా రచ్చ చేశారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న మిగతా రోగులంతా ఆందోళనకు గురయ్యారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన తమ బంధువుకు నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్లు చికిత్స అందించడం లేదంటూ కొందరు వ్యక్తులు ఆస్పత్రి వద్ద గొడవకు దిగారు. అలాంటిదేం లేదని, సరైన వైద్యం అందిస్తున్నామని డ్యూటీలో ఉన్న డాక్టర్ చెప్పినా.. వినకుండా అతనిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారిని అడ్డుకుని, అక్కడి నుంచి పంపించేశారు.

కాగా డ్యూటీ డాక్టర్ తాము రాత్రి పూట ఎన్నిసార్లు పిలిచినా స్పందించడంలేదని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల ముందే డాక్టర్లతో కొద్ది సేపు వాగ్వాదానికి దిగారు. తాము మంత్రి అనుచరులమని, చికిత్స ఎందుకు సరిగా చేయట్లేదని, డాక్టర్లను నానా మాటలు అన్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఫిర్యాదు ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొంటున్నారు.