భార్య మందు తేలేదని కోపం.. ఉస్మానియాలో రోగి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

భార్య మందు తేలేదని కోపం.. ఉస్మానియాలో రోగి ఆత్మహత్య

April 7, 2022

03

ఆస్పత్రిలో మద్యం తాగొద్దన్నందుకు ఓ యువకుడు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన నాగరాజు (22) రెండో తేదీన పురుగుల మందు తాగాడు. దీంతో చికిత్స కోసం నాగరాజును ఆయన భార్య సంతోష ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లింది. కులీ కుతుబ్ షా భవంతిలోని నాలుగో అంతస్తులో నాగరాజు చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మద్యం కావాలని భార్యను వేధించేవాడు. భార్య వారించడంతో కోపోద్రిక్తుడై, నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే చనిపోయాడు. మద్యం లేకపోవడంతో మానసికంగా కుంగిపోయాడని పోలీసులు తెలిపారు.