వాళ్లు కుక్కలు కాదురా, మనుషులురా..  - MicTv.in - Telugu News
mictv telugu

వాళ్లు కుక్కలు కాదురా, మనుషులురా.. 

December 2, 2019

government hospital 02

కుక్కలకు, కోతులకు సంతాన నిరోధక ఆపరేషన్లను దారుణంగా చేస్తుంటారు. మూగజీవులు కనుక ప్రశ్నించలేవని  పశువైద్యులు కొందరు వాటికి సర్జరీలు చేసిన తర్వాత రోడ్డున పడేస్తుంటారు. ఇంచుమించు అలాంటి ఘోరమే మధ్యప్రదేశ్‌లో జరిగింది. సృష్టికి మూలమైన స్త్రీలపట్ల ఆస్పత్రి సిబ్బంది దారుణంగా వ్యవహరించారు. కటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన తర్వాత వారిని చేతులపై మోసుకుంటూ తీసుకెళ్లి కటిక నేలపై పడుకోబెట్టారు. అది కూడా ఒకరి పక్కన ఒకరిని పడేశారు. 

ఛత్తార్‌పూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ఈ దారుణం జరగింది. 37 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన తర్వాత వారిని స్ట్రచెర్లపై కాకుండా చేతులపై మోసుకొచ్చారు. నేలపై కనీసం దుప్పట్లు కూడా వెయ్యకుడా పడుకోబోబెట్టి వెళ్లిపోయారు. ఆస్పత్రిలో తగినన్ని బెడ్లు లేకపోవడం వల్ల ఇలా చేయాల్సి వచ్చిందని, తామేమీ చేయలేమని వైద్యులు చెప్పుకొచ్చారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరైన బెడ్లు లేనప్పుడు రోజుకు కొన్ని ఆపరేషన్లు మాత్రమే చేసుండాల్సిందని జనం అంటున్నారు.