తొలిసారి వేరువేరుగా ఓటేసిన అవిభక్త కవలలు - MicTv.in - Telugu News
mictv telugu

తొలిసారి వేరువేరుగా ఓటేసిన అవిభక్త కవలలు

May 19, 2019

ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి దేశ పౌరుడి ప్రథమ కర్తవ్యం. కానీ ప్రస్తుతం ఎంతో మంది ఓటుహక్కుని ఉపయోగించుకోవడం లేదు. నగర ప్రజలైతే పోలింగ్ రోజుని సెలవు దినంగా భావించి ఎంజాయ్ చేస్తున్నారు.

కానీ బీహార్ రాజధాని పాట్నాలో తొలిసారిగా అవిభక్త కవలలు ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. 23 ఏళ్ల వయస్సు గల సబా, ఫరా అనే ఇద్దరు అమ్మాయిలు పుట్టుకతోనే అవిభక్త కవలలు. అయితే వీరిద్దరికీ వేరువేరుగా ఓటు హక్కులు లభించడం విశేషం. తొలిసారిగా వచ్చిన అవకాశాన్ని వీరు వినియోగించుకున్నారు. 2015 లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరికి కలిపి ఒకటే ఓటర్ ఐడీ ఉండేది. కానీ ఈసారి ఇద్దరికీ వేరు వేరు ఓటర్ కార్డులు లభించాయి. దీంతో ఇద్దరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి వేరు వేరుగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు సంతోషంగా ఉందని తెలిపారు.