Patra Chawl land scam case: MP Sanjay Raut's judicial custody extended till 19 September
mictv telugu

మరో 14 రోజులు వరకూ జైల్లోనే సంజయ్ రౌత్

September 5, 2022

పాత్రాచాల్‌ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు మరో షాక్ తగిలింది. మ‌రో 14 రోజుల పాటు జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీని పొడిగిస్తూ ముంబైలోని ఈడీ ప్ర‌త్యేక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 19 దాకా రౌత్ జైల్లోనే ఉండనున్నారు. 60 ఏళ్ల సంజయ్ రౌత్‌ను ఆగస్టు 1న ఈడీ అరెస్టు చేసింది. సోమవారంతో ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పూర్తవుతుండటంతో కోర్టు ముందు ఆయనను అధికారులు హాజరు పరచారు. కోర్టు మరో రెండు వారాలు జ్యుడిషయల్ కస్టడీ పొడిగించింది.

పాత్ర‌చాల్ కుంభ‌కోణంలో రౌత్ పాత్ర ఉంద‌ని ఆరోపించిన ఈడీ అధికారులు… రౌత్ ఇల్లు, కార్యాల‌యం, ఆయ‌న బంధువుల ఇళ్ల‌లో ప‌లు ద‌ఫాలుగా సోదాలు చేసిన త‌ర్వాత మ‌నీ ల్యాండ‌రింగ్ కింద కేసు న‌మోదు చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌ను అరెస్ట్ చేయ‌గా… ఈడీ క‌స్ట‌డీ ముగిసిన తర్వాత కోర్టు ఆయ‌న‌ను రిమాండ్‌కు త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే.