పెట్రోల్‌ కోసం బాటిళ్లతో వస్తే ఫోటో తీయండి - MicTv.in - Telugu News
mictv telugu

పెట్రోల్‌ కోసం బాటిళ్లతో వస్తే ఫోటో తీయండి

December 2, 2019

మహిళలపై యాసిడ్ దాడులు జరిగినప్పుడు షాపుల్లో యాసిడ్ అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెట్రోల్ పైనా అలాంటి ఆంక్షలనే పోలీసులు విధిస్తున్నారు. తహసీల్దార్ విజయారెడ్డి, దిశ ఘటనలతో పెట్రోల్ బంకుల్లో ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఎవరైనా ఖాళీ బాటిళ్లు పట్టుకుని పెట్రోల్ కావాలని వస్తే పోసామా, పని అయిపోయిందా అని ఊరుకోవద్దని అన్నారు. పెట్రోల్ బంకు సిబ్బంది విధిగా అలాంటివారి వివరాలను తీసుకోవాలని, వారి ఫోటోను కూడా స్మార్ట్‌ఫోన్‌లో కచ్చితంగా తీసుకోవాలని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు.

Patrol.

ఇకపై గుడ్డిగా బాటిళ్లలో పెట్రోల్ పోసి విక్రయించే బంక్‌ల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు తమ జోన్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంక్‌లకు నోటీసులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. తాము చేస్తోన్న సూచనలను పెట్రోల్ బంకుల యాజమాన్యాలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. బంక్ యజమానులు, నిర్వాహకులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని అన్నారు.