మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు పౌల్ అలెన్ ఇకలేరు - MicTv.in - Telugu News
mictv telugu

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు పౌల్ అలెన్ ఇకలేరు

October 16, 2018

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు పౌల్ అలెన్(65) మృతి చెందారు. కొద్ది రోజులుగా నాన్-హడ్జ్‌కిన్ లింఫోమా కేన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటించారు. రెండు వారాలకే అలెన్ కన్నుమూసినట్లు ఆయన కంపెనీ వుల్కన్ తెలిపింది. తొమ్మిదేళ్ల క్రితం అలెన్ కేన్సర్ బారి నుంచి కోలుకున్నారు. మళ్లీ అదే వ్యాధి రావడంతో ప్రాణాలు విడిచారు. అలెన్ మృతితో ఆయన బాల్యమిత్రుడు బిల్‌గేట్స్ తీవ్ర దిగ్భ్రాంది వ్యక్తం చేశారు.Paul Allen: Microsoft co-founder and billionaire dies aged 65‘నా చిన్ననాటి స్నేహితుడిని కోల్పోయాను. అతను ఇక లేడు అన్న మాట విని నా గుండె ముక్కలైంది. పౌల్ లేకుండా పర్సనల్ కంప్యూటింగ్ లేదు’ అని బిల్ గేట్స్ కన్నీమున్నీరుగా విలపించారు. అలాగే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల ‘కంపెనీ, ఐటీ ఇండస్ట్రీకి అలెన్ ఎంతో సేవచేశారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అన్నారు. 1975లో బిల్ గేట్స్, పౌల్ అలెన్‌ కలిసి మైక్రోస్టాఫ్ సంస్థ ప్రారంభించారు. వీరిద్దరూ పాఠశాలకెళ్లే సమయం నుంచి మంచి స్నేహితులు. 1983లో ఆయన పోర్ట్‌ల్యాండ్ ట్రయల్ బ్లేజర్స్ అనే బాస్కెట్ బాల్ టీంను ఆయన కొనుగోలు చేశారు. సియాటిల్ సౌండర్స్ ఎఫ్‌సీ అనే సాకర్ టీం, సియాటిల్ సీహాక్స్ జట్లలో ఆయనకు వాటా ఉంది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ఆయన 44వ స్థానంలో ఉన్నారు. 1986లో సోదరి జోడీ అలెన్‌తో కలిసి వుల్కన్ సంస్థను స్థాపించారు. పర్యావరణ, సమాజ హిత కార్యక్రమాల కోసం 2 బిలియన్ డాలర్లను ఆయన విరాళంగా ఇచ్చారు. అలెన్ మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. 1983లో మొదటి సారి కేన్సర్ సోకడంతో అలెన్ ఆయన పదివికి రాజీనామా చేశారు.