ఆటగాడికి, అతని గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

ఆటగాడికి, అతని గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా

March 22, 2020

Paulo Dybala Coronavirus

కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఈ మహమ్మారి ఓ జంటకు అంటుకుంది. అర్జెంటీనా ఆటగాడు, జువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్ సభ్యుడు పౌలోడైబాల కరోనా బారినపడ్డాడు. తన గర్లఫ్రెండ్‌ ఒరియానాకు కూడా కరోనా ఉందని వైద్యులు వెల్లడించారని పౌలో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం తామిద్దరం ఆరోగ్యంగానే ఉన్నామని, హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నామని పేర్కొన్నాడు. కాగా, జువెంటర్ క్లబ్‌లో పౌలో కన్నా ముందు బ్లెయిసె మాటుడి, డానియల్ రుగాని అనే ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. కరోనా ప్రభావం తీవ్రతరం దాల్చడంతో ఇటలీ కొన్ని ఆటలను రద్దుచేసింది. ఫ్లైట్ ఫుట్‌బాల్ లీగ్, సిరీస్ ఏ లీగ్‌లను ఏప్రిల్ మూడు వరకు వాయిదా వేసింది.