ప్రతి ఒక్కరికి నచ్చడానికి నేను బంగారాన్ని కాదు..! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రతి ఒక్కరికి నచ్చడానికి నేను బంగారాన్ని కాదు..!

September 2, 2017

కొన్నిరోజులుగా కత్తి మహేష్  మరియు పవన్ కళ్యాణ్  ఫ్యాన్స్  మధ్య రాజుకున్న రగడ అందరికి తెల్సిందే,సోషల్ మీడియాలో,టీవీల్లో ఎక్కడ చూసిన ఇదే టాపిక్..కత్తి మహేష్ గురించి ఈ హీరో ఏమన్నాడో తెల్సా ?కత్తి మహేష్ కు ప్రముఖ హీరో వార్నింగ్, కత్తి మహేష్ ను పవన్ కళ్యాన్ ఫ్యాన్  ఎలా ఆడుకున్నాడో చూడండి.?ఇలా ఒకటా రెండా… రకరకాలు హెడ్డింగులు పెట్టి వార్తల మీద వార్తలు,అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మొదటి సారి స్పందిచారు.

’నన్ను తిట్టేవాళ్లుంటారు,మెచ్చుకునేవాళ్లుంటారు..సపోర్ట్ చేసే వాళ్లుంటారు..ఇవన్నీ నేను భరించడానికి సిధ్ధంగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి నచ్చడానికి నేను బంగారాన్ని కాదు నేను మనిషినే, నాలో నచ్చే విషయాలు  ఉంటాయి,నచ్చని విషయాలుంటాయి, నన్ను తిట్టి, ద్వేషించే వాళ్లు  అనవసరంగా వాళ్ల కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఒకర్ని ద్వేషించాలంటే మన బాడీ లోపట బ్లడ్ పొల్యూట్ అవుద్ది,మొహంలో కండరాలన్ని కదిలిపోతాయి, అనవసరంగా వాళ్ల హెల్త్ వాళ్లే పాడు చేసుకుంటున్నారు. క్రిటిసైస్ చేస్తున్న వాళ్ల ఇంటెన్సీటీ చూడండి మీకే అర్ధమవుతుంది…అనవసరంగా ఇలాంటి వాళ్లని పెంచి పెద్ద చెయ్యడం తప్ప ఇంకేం లేదు. తిట్టేవాళ్లుంటే భరిస్తాను, నన్ను షబ్బీర్ ఆలీ తిడ్తారు,దానం నాగేందర్ తిడ్తారు కానీ ఫంక్షన్లలో కలిసినపుడు చాలా బాగా మాట్లాడుకుంటాం …నేను చాలా మందిని తిడతాను కానీ మళ్లీ కలిసి పోతాను అది ఓ బేసిక్ కర్టసీ. నేనెప్పుడు నాసినిమాలకు ప్రమోట్ చెయ్యమని అడగను, 100 పంక్షన్లు చేసుకోను..ఎందుకంటే జనాలకి దెబ్బలు తగులుగాయని నలిగిపోతారనే బాద, కానీ పాలిటిక్స్ అంటే మాత్రం ప్రజల్లోకి వెళ్తాను  ఎందుకంటే సమస్యలుంటాయి కాబట్టి…సహనం ఉండాలి  కానీ హద్దులు దాటిపోయి మనం చచ్చిపోయేంత సహనం నేను భరించను, మనం ఎవ్వరి మీద దాడి జెయ్యం, మనల్సి దాడి చేస్తున్న వాళ్ల మీద కొట్టమని చెప్తామా ఏంటి, కనీసం మన సేఫ్టీ చూసుకోవాలి కదా అని పవన్ అన్నారు.