pavan fires on ycp government
mictv telugu

జనసేన సభకు స్థలం ఇవ్వడమే నేరమా ?

November 4, 2022

వైసీపీ సర్కార్‎పై జనసేన అధినేత మరోసారి రెచ్చిపోయారు. గతంలో తన ఆవిర్భావ సభ పెట్టిన గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేయడంపై జనసేనాని ధ్వజమెత్తారు. కూల్చివేతల ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని దుయ్యబట్టారు. వైసీపీకి ఓట వేయని వారిపై కక్షగట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రోడ్డు విస్తరణ పేరుతో గ్రామంలో అరాచకమే సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటం గ్రామవాసులు జనసేన మద్దతుదారులు కావడమే వైసీపీ ప్రజాప్రతినిధుల ఆగ్రహానికి కారణమన్నారు పవన్.

తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో శుక్రవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించిన అధకారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ నివాస స్ధలాలు పోతున్నాయని, తమకు 120 అడుగుల రోడ్డు వద్దని వారించారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో వారు జేసీబీలకు అడ్డుతగిలారు. అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తడంతో పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.