pavan kalayn helps ippatam village people
mictv telugu

ఇప్పటం గ్రామస్తులకు పవన్ ఆర్థిక సాయం

November 8, 2022

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్ళు కూల్చివేతకు గురైన బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు. వారికి లక్ష రూపాయలు అందించాలని పవన్ నిర్ణయించినట్లు జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇటీవల ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతంపై పెద్ద దుమారం రేగింది. రోడ్డును విస్తరించేందుకు గ్రామంలో ఇళ్లను కూల్చివేసారు. అడ్డుకున్న వారిపై కూడా కేసులు నమోదు చేసారు. దీనిపై రంగంలో దిగిన పవన్ నేరుగా ఇప్పటం వెళ్లి పరిస్థితి సమీక్షించారు.బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అప్పుడు చెప్పినట్లుగానే వారికి లక్ష రూపాయలను ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమయ్యారు జనసేనాని.

లక్షరూపాయలను త్వరలోనే పవన్ కళ్యాణ్ అందించనున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. “ఇప్పటం గ్రామప్రజలను చూసి పవన్ చలించిపోయారు. వైసీపీ దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు, ఆవాసాలు కోల్పోయారు. తన వంతున ఆర్ధికంగా అండగా నిలబడాలని తమ అధినేత నిరుపేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గం. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది” అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.