pavan kalayn speech in vizyanagaram tour
mictv telugu

నేను దెబ్బతిన్న పులి లాంటోడిని :పవన్

November 13, 2022

ఒక్క ఛాన్స్ ఇవ్వండి..పాలన అంటే ఏంటో చూపిస్తా అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా
గుంకలాంలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించిమాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవాడు లేకపోతే దోపిడీ పెరిగిపోతుందన్నారు. జగనన్న కాలనీల దోపిడీపై ప్రధాని మోదీకి నివేదిక ఇస్తానని తెలిపారు. ఎవరైనా దోపిడీలకు పాల్పడితే చొక్కాలు పట్టుకుని ప్రశ్నించాలంటూ పిలుపునిచ్చారు.మెరుగైన భవిష్యత్ కోసం జనసేనపై నమ్మకం ఉంచాలని..మార్పు అంటే ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. జనసేన అధికారంలోకి వస్తే ఇసుక ఫ్రీగా ఇస్తామని జనసేనాని హామీ ఇచ్చారు. తనకు అవకాశం ఇస్తే గూండాలతో పోరాడతానని తెలిపారు. తాను ఓడిపోయిన..గాయపడిన పులి లాంటోడ్ని అని..అవినీతి చేసేవాళ్ల అంతం చూస్తా అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.