నాకు నేనే సూపర్ హీరో.. బాలయ్య - MicTv.in - Telugu News
mictv telugu

నాకు నేనే సూపర్ హీరో.. బాలయ్య

March 17, 2018

టీడీపీని, తన బావ చంద్రబాబు నాయుడిని తీవ్రంగా  విమర్శిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి  నటుడు బాలకృష్ణ నిరాకరించారు. ‘’ఒకరిని హీరో చేయడం నాకు ఇష్టం లేదు.. నాకు నేనే సూపర్ హీరో.. అంతే ‘ అని అన్నారు. ఆయన  శనివారం తన నియోజకవర్గమైన హిందూపుంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో రూ. 2కోట్లతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియం కూడా ఉంది.ఈ సందర్భంగా విలేకర్లు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. బాలయ్య అల్లుడు లోకేశ్ అవినీతికి పాల్పడుతున్నాడన్న పవన్ ఆరోపణలనూ ప్రస్తావించారు. అయితే వాటిపై తాను ఏమీ మాట్లాడనని, తాను సూపర్ హీరో అని  బాలయ్య జవాబు దాటవేశారు.