పవన్ కళ్యాణ్ 'పింక్' ఫైట్ వీడియో లీక్ - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కళ్యాణ్ ‘పింక్’ ఫైట్ వీడియో లీక్

February 3, 2020

pink.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘పింక్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో పవన్ ‘లాయర్ పాత్ర’లో కనిపించనున్నారు. ప్రస్తుతం.. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 

కాగా.. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. తాజాగా మరో వీడియో లీక్ అయింది. ఈ వీడియోలో పవన్..ఫైటింగ్ సీన్‌లో కనిపిస్తున్నారు. అరుస్తూ.. ఎవరినో బలంగా కొడుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో రూపంలో ఇలా వీడియోస్ లీక్ అవుతూనే ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి గతంలో దిల్‌రాజుపై పవన్ సీరియస్ కూడా అయ్యారని సమాచారం. ఈ సినిమాకు వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘లాయర్ సాబ్’ అని టైటిల్ పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించనున్నాడని తెలుస్తోంది. ఆ తరువాత గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్‌తో పవన్ సినిమా ఉంటుందని తెలుస్తోంది.