ఇంజనీర్ స్టూడెంట్ గా పవన్... - MicTv.in - Telugu News
mictv telugu

ఇంజనీర్ స్టూడెంట్ గా పవన్…

August 16, 2017

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో పవన్ 25వ సినిమా రూపొంతోంది. గీ సినిమా సంకాంత్రీ కానుకగా విడుదల కానుందట. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తరువాత పవన్, త్రివిక్రమ్ వీళ్లిద్దరు కలసి చేస్తున్న ఈ సినిమాకు సంబందించి ఇప్పటివరకు ఓ లుక్ గాని, టైటిల్ గాని ఏంటనేది గాని రివీల్ కాలేదు.

ఈ సినిమా పై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాలో పవన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడట. మెదట గీ మూవీకి ఇంజనీర్ బాబు అని టైటిల్ పెడుదాం అనుకున్నారట .

కాని గిప్పుడు ఈ సినిమాకు ‘రాజు వచ్చినాడో టైటిల్’ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.రాజకీయాల్లోకి పవన్ పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తున్నందుకు త్రివిక్రమ్ కొత్తగా ఆలోచించి ఇట్లా పెట్టాడు కావచ్చు అనుకుంటున్నారు సినీ జనాలు. ఈ సినిమా వంద కోట్లతో హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్ బ్యానర్ పై తీస్తున్నారు. ఈ మూవీలో హీరొయిన్లు గా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు.