పవన్ భార్య ఆమెనే ! - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ భార్య ఆమెనే !

July 1, 2017

పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన రేణూదేశాయ్ కు సోషల్ మీడియా నుండి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వస్తున్నాయని ఆమె చాలా పరేషాన్ అవుతోంది. సెలెబ్రెటీ కదా తప్పకుండా చాలా మంది దృష్టి వాళ్ల మీదుంటుంది. అందునా పవర్ స్టార్ మాజీ భార్య అవడం చేత తప్పకుండా ఆ తాకిడి వుంటుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ తను కలుస్తారా ? లేకపోతే శాశ్వతంగానే విడిపోతారా ? అనే ప్రశ్నలు ఆమెకు తలనొప్పిలా తయారైనట్టున్నాయి. ప్రతిసారి పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడు చాలా కూల్ గా సమాధానం చెప్పేది. కానీ ఈసారి కాస్త రాష్ గానే ఫేస్ బుక్ త్రూ సమాధానం చెప్పింది.

‘ నేనూ పవన్ కలుసుకోవడం అనేది ఎప్పటికీ జరగదు. అన్నా లెజ్ నెవానె తన భార్య, వాళ్ళకి ఒక పాప కూడా వుంది. నా ఇద్దరు బిడ్డలకు పవన్ కేవలం తండ్రి మాత్రమే. సజావుగా సాగుతున్న వాళ్ళ వైవాహిక జీవితంలోకి నేను వెళ్ళటం సబబు కాదు. నేనూ తను ఎప్పటికీ మంచి స్నేహితులుగానే వుండిపోతాం. అంతే తప్ప భార్యాభర్తలం ఎప్పటికీ కాలేము ’ అని చాలా ఖరాఖండిగా చెప్పేసింది రేణు.

తను ఎంత చెప్పినా పవన్ కళ్యాణ్ ది ఒడవని ముచ్చటే. ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేస్కున్న తను నాలుగో పెళ్ళి చేసుకోడని గ్యారెంటీ లేదు.. అప్పుడు రేణూలా అన్నా లెజెనావాకు కూడా అర్థం చేస్కునే గొప్ప మనసు వుంటే చాలనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే పెళ్ళాలను ఉద్ధరించిన పవర్ స్టార్ పార్టీ పెట్టి సమాజాన్ని కూడా ఉద్దరిస్తాడేమో చూడాలి. ఆయన గనక సిఎం అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను రెండు, మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎంత మాత్రమూ తప్పుకాదని, అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం తరుపున స్పెషల్ ప్యాకేజీలు, కొత్త పథకాలేమైనా రచిస్తుండొచ్చు !?

https://www.facebook.com/RenuDesai/?ref=nf&hc_ref=NEWSFEED