Pavithra Lokesh filed the case
mictv telugu

నా పరువు తీస్తున్నారు.. కేసు పెట్టిన పవిత్రా లోకేష్

June 30, 2022

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులో మంచి పేరు సంపాదించుకున్న నటి పవిత్రా లోకేష్. ఈమె ప్రస్తుతం తెలుగు విలక్షణ నటుడు నరేష్‌తో వివాహం చేసుకోనుందనే వార్త గత కొన్ని రోజులుగా మీడియాలో వినవస్తోంది. ఈ నేపథ్యంలో పవిత్రా లోకేష్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హైదరాబాదులో కాదు కర్ణాటకలో. పవిత్ర తండ్రి మైసూర్ లోకేష్ కన్నడలో మంచి నటుడు. సోదరుడు కూడా కన్నడలో పలు సినిమాల్లో నటించాడు. అక్కడ వీరి కుటుంబానికి మంచి పేరుంది. అయితే కొందరు ఈమె పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఇబ్బంది కలిగించేలా పోస్టులు పెడుతున్నారంట. అంతేకాక, పేరు చెడగొట్టేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారనే ఆగ్రహంతో అలాంటి వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. కాగా, భర్తతో అధికారికంగా విడాకులు తీసుకోనందున పవిత్రా లోకేష్ ఇప్పుడా పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.