క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్‌పై ఆమె మొదటి భర్త సుచేంద్ర ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద డబ్బు లేదని ఇద్దరు పిల్లలున్నా వదిలేసి వెళ్లిపోయిందని విమర్శించాడు. వీరిరువురు చేసుకుంటున్న ఆరోపణలు కన్నడ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన మాటల్లోనే.. ‘పవిత్రతో జీవితం మొదట్లో బాగానే ఉంది. ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమె వైఖరిలో మార్పు వచ్చింది. డబ్బు, లగ్జరీ లైఫ్ కావాలనే కోరిక చాలా బలంగా ఉంది. అయితే నేను ఆర్ధికంగా ఆ స్థాయిలో లేను కనుక వదిలేసి వెళ్లిపోయింది. నాతో కాపురం చేస్తున్నప్పుడు కూడా వేరే రిలేషన్స్ మెయింటైన్ చేసిందని తెలిసింది. కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. నేను కొడతాను, తిడతానని చెప్పింది. సరే, అలాగని నరేష్‌తో ఉండడం కరెక్టా? ఆయన కాపురం ఎందుకు కూల్చాలి? ఇది ఆమెకు అలవాటే. వీలుని బట్టి ఎంత దొరికితే అంత దోచుకునే బుద్ధి ఆమెది. ఆమెకు జీవితంపై ఆశలు ఎక్కువ. కష్టపడే తత్వం లేదు. ఒకవేళ నరేష్‌ను పెళ్లి చేసుకున్నా ఆరు నెలల్లో వదిలేస్తుంది. తనకు కావాల్సిన డబ్బు లాగేసుకుంటుంది. ఆమె మనస్తత్వం నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నాను. సాహిత్యం ఎక్కువగా చదువుతున్నా. త్వరలో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నా’నని వివరించాడు.