pavithra Lokesh talking about her bonding with Naresh
mictv telugu

అతను నా భర్త కాడు.. సహజీవనం చేశా అంతే : పవిత్ర లోకేష్

June 30, 2022

క్యారెక్టర్ ఆర్టిస్టులయిన నరేష్, పవిత్రా లోకేష్‌ల ప్రేమ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు ఈ ఎఫైర్‌పై స్పందించని పవిత్ర.. తాజాగా కన్నడ మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలు ఓపెన్‌గా చెప్పేసింది. ఆమె మాటల్లోనే ‘ప్రస్తుతం నేను సూపర్ స్టార్ కృష్ణ, నరేష్‌లతో వారి పాంహౌస్‌లో కలిసే ఉంటున్నాం. మా బంధానికి కృష్ణ గారి కుటంబ ఆమోదం ఉంది. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నరేష్ జీవితంలో నాకు చోటుంటే చాలు ఇంకేం వద్దు. ఇక రమ్య రఘుపతి (నరేష్ మూడో భార్య) సరిగా ఉంటే నరేష్ కుటుంబం ఆమె వెంట ఉండేది. ఆమె ప్రవర్తన నాకు నచ్చలేదు. నరేష్‌తో ఆమెకు ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి ప్రయత్నిస్తా. అటు నా మొదటి భర్తతో నాకు పెళ్లి జరగలేదు. కేవలం సహజీవనం చేశాం. కాబట్టి విడాకుల ప్రసక్తే రాద’ని తేల్చి చెప్పింది. కాగా, దీంతో పవిత్రా లోకేష్, నరేష్‌ల పెళ్లి కన్ఫామ్ అయిపోయినట్టేనని భావిస్తున్నారు.