సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నట్టు, వీరిద్దరూ కృష్ణని కడసారి చూసేందుకు వెళ్లి వెకిలి చేష్టలు చేశారని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కృష్ణ పార్థివదేహం దెగ్గర చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్టు ట్రోల్స్ చేశారు. అయితే ఈ ట్రోల్స్ పై సీరియస్ అవుతూ.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది పవిత్ర. దీంతో కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ పై పోలీసులు కేసులు వేసి విచారణ చేపడుతున్న సమయంలో మరో కొత్త ట్విస్ట్ ఎదురైంది. ఈ వేధింపుల కేసులో రమ్య రఘుపతి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈమె నటుడు నరేష్ మూడవ భార్య. నటి పవిత్రతో సంబంధం పెట్టుకునే నరేష్ తనను దూరం పెట్టాడని ఆరోపిస్తూ వస్తుంది రమ్య. ఆ మధ్య నరేష్, పవిత్రలని బెంగుళూరు హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బీభత్సం సృష్టించింది రమ్య రఘుపతి. దీంతో ఈ ముగ్గురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. కక్ష పెట్టుకునే రమ్య రఘుపతి తనపై ట్రోల్స్ చేయిస్తుందని ఆరోపించిది పవిత్ర.
ఇక అసత్య కథనాలతో తనని వేధిస్తున్నకొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ వెనుక సైతం రమ్య రఘుపతి ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది నటి పవిత్ర లోకేష్. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. అయితే యూట్యూబ్ ఛానెల్లు తమపై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేయడం వెనుక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఉన్నారని పవిత్ర లోకేష్ అనుమానం వ్యక్తం చేసినట్టు.. రామారావు, శివకుమారి, రమ్య రఘుపతి పేర్లను ఫిర్యాదులో పేర్కొంది. దాంతో పవిత్ర లోకేష్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీపీ ప్రసాద్ వెల్లడించారు. ఈ ఏడాది రమ్య రఘుపతిపై కొందరు చీటింగ్ కేసు పెట్టారు. డబ్బుల విషయంలో మోసం చేసిందని ఆమెపై కేసులు ఉన్నాయి. అయితే, రమ్య మోసాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని నరేష్ ప్రకటించడంతో అసలు గొడవ మొదలైంది.