పోలీసులను ఆశ్రయించిన నటి పవిత్ర లోకేష్ - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులను ఆశ్రయించిన నటి పవిత్ర లోకేష్

November 26, 2022

సినీ నటి పవిత్ర లోకేష్ శనివారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. నరేష్ తో పాటు తనపై సోషల్ మీడియాలో అభ్యంతర కామెంట్లు చేస్తున్నారని, ఫోటోలు మార్ఫింగ్ చేసి వార్తలు రాస్తున్నారని ఫిర్యాదు చేశారు. అందులో కొన్ని వెబ్ సైట్ల పేర్లు, టీవీ ఛానెళ్ల పేర్లను పేర్కొన్నారు. తమపై జరిగే అసత్య ప్రచారం, ట్రోలింగ్ అడ్డుకోవాలని కోరారు. కాగా, ఇటీవల మైసూరులో వీరిద్దరూ ఓ హోటల్లో ఉండగా, నరేష్ మూడో భార్య రమ్య వీరిని ఉన్నపళంగా పట్టుకుంది. ఆమె నుంచి తప్పించుకుని నరేష్, పవిత్రలు వెళ్తున్న వీడియో సంచలనంగా మారింది.

అయితే తర్వాత పవిత్ర తాము పెళ్లి చేసుకోలేదని వివరణ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ జంటపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు అభిమానులు చివరిసారి చూడడానికి పద్మాలయా స్టూడియోకి వచ్చారు. అక్కడ నరేష్, పవిత్రలు భార్యాభర్తల తరహాలో వచ్చిన వారితో మాట్లాడుతూ కనిపించారు. దీనిపై కూడా ట్రోల్స్ నడిచాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కాగా, నరేష్ రమ్యకు ఇంకా విడాకులు ఇవ్వలేదు. ఇటు పవిత్ర లోకేష్ కూడా తన మాజీ భర్త సుచేంద్రకు విడాకులు ఇవ్వలేదని సమాచారం.