టాలీవుడ్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆయన మాజీ భార్య రేణు దేశాయ్‌లకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫోటోలను వీక్షిస్తున్న ఆయన అభిమానులు, నెటిజన్స్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లు మళ్లీ కలిశారా? అంటూ తెగ చర్చించుకుంటున్నారు. పవన్, రేణు దేశాయ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆ ఫోటోలలో పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లతోపాటు అకీరా నందన్, ఆద్య కూడా ఉన్నారు. ఫ్యామిలీ అంత ఒకేచోట చాలా సంవత్సరాల తర్వాత ఫోటోలకు పోజులు ఇవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకి పవన్, రేణు దేశాయ్‌లు ఎందుకు కలిశారు? ఎక్కడ కలిశారు? అనే వివరాల్లోకి వెళ్తే.. పవన్, రేణు దేశాయ్ దంపతుల తనయుడు అకీరా నందన్ హైదరాబాద్‌లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూలులో చదువుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమలో సోమవారం అకీరా గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పవన్ కల్యాణ్‌తోపాటు రేణు దేశాయ్ కూడా పాల్గొంది. అనంతరం తన కుమారుడితో కలిసి ఇద్దరు ఫోటోలు దిగారు. అకీరా కోసమే పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్‌కు వచ్చినట్లు సమాచారం. చాలా రోజులకు తన ఫ్యామిలీతో కలిసి ఆయన ఫోటోలకు పోజులిచ్చారు. పవన్, రేణు దేశాయ్ భార్యాభర్తలుగా విడిపోయిన తర్వాత తమ ఇద్దరి పిల్లలు రేణుదేశాయ్ దగ్గరే ఉంటున్నారు. వారి చదువుల విషయంలో, భవిష్యత్తు విషయంలో అప్పుడప్పుడు తమ పట్టింపులను పక్కన పెట్టి, పలు వేడుకులకు హాజరౌతున్నారు. ఇక, అకీరా నందన్ 16 ఏళ్లు పూర్తి చేసుకోని, 17వ ఏటలోకి అడుగుపెట్టాడు. మొత్తానికి అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పవన్, రేణు దేశాయ్ మళ్లీ కలిశారు.