జనసేనాని రైతు సౌభాగ్య దీక్ష.. ఎమ్మెల్యే రాపాక దూరం - MicTv.in - Telugu News
mictv telugu

జనసేనాని రైతు సౌభాగ్య దీక్ష.. ఎమ్మెల్యే రాపాక దూరం

December 12, 2019

Pawan 02

రైతు సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాన్ ఒక రోజు దీక్షను ప్రారంభించారు. కాకినాడలోని జేఎన్టీయూ ఎదురుగా ‘రైతు సౌభాగ్య దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు ఈ దీక్షను విరమించనున్నారు. దీక్ష కోసం వచ్చిన పవన్‌కు పార్టీ శ్రేణులు,రైతులు, మహిళలు, పూల మాలలు వేసి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. గిట్టుబాటు ధర, రైతు సమస్యలే అజెండాగా ఈ దీక్ష నిర్వహిస్తున్నారు.

రైతుల్లో భరోసా నింపేందుకు చేపట్టిన ఈ దీక్షకు పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. నాగబాబు కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. అయితే జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం దీనికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తాను హాజరుకాలేనని పార్టీకి వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అధినేత దీక్షకు ఎమ్మెల్యే దూరంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా పవన్ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బదులు కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ప్రవేశపెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ రాపాక మాత్రం అసెంబ్లీ వేదికగా స్వాగతించిన సంగతి తెలిసిందే.