Pawan Kalyan accepted Minister KTR's challenge, Nominates Chandrababu’s Nam
mictv telugu

మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ స్వీకరించిన పవన్ కళ్యాణ్

August 7, 2022

జాతీయ చేనేత దినోత్సవం రోజున.. నేతల మధ్య ఛాలెంజ్‌లు రక్తికట్టిస్తున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్ వేదికగా ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. ఆనంద్ మహీంద్రా, సచిన్ టెండూల్కర్‌, పవన్‌ కల్యాణ్‌లు చేనేత వస్త్రాలు ధరించి ఫోటోలు పోస్ట్ చేయాలని ఛాలెంజ్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్‌ స్వీకరించారు జనసేనాని పవన్ కల్యాణ్‌.

ఈ సందర్భంగా పవన్‌ స్పందిస్తూ కేటీఆర్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ‘రామ్‌ భాయ్‌ (కేటీఆర్‌).. మీ ఛాలెంజ్‌ను స్వీకరించా’ అంటూ చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌, ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి పవన్‌ ‘చేనేత’ సవాల్‌ విసిరారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలని పవన్‌ వారిని కోరారు.