పవన్ కల్యాణ్ ఓ శ్రీకృష్ణుడు.. యాంకర్ శ్యామల - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్ ఓ శ్రీకృష్ణుడు.. యాంకర్ శ్యామల

April 20, 2018

నటి శ్రీరెడ్డికి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మధ్య మొదలైన వివాదం చినికి చినికి అల్లకల్లోలంగా మారుతోంది. బాధితుల్లో అధికశాతం శ్రీరెడ్డి వైపు నిల్చోగా, కొందరు పవన్ పక్షం చేరుతున్నారు. టీవీ యాంకర్ శ్యామల కూడా రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ శ్రీకృష్ణుడని, శ్రీరెడ్డి శిఖండి అని పోల్చుతూ ఒక పోస్ట్ పెట్టారు.

 

‘శిఖండిని అడ్డుపెట్టడానికి భీష్ముడు కాదు…!! పద్మవ్యూహం పన్నడానికి అభిమన్యుడు కాదు!! యుద్ధం చేస్తుంది సాక్ష్యాత్ “శ్రీకృష్ణుడే”జాగ్రత్త….!!!’ అంటూ పవన్ కల్యాణ్ను శ్యామల శ్రీకృష్ణుడిగా అభివర్ణించింది. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. శ్యామల.. పవర్ స్టార్‌ను పొగడబోతూ ఆయనపై బురదజల్లిందని అభిమానులు అంటున్నారు. తన తల్లికి న్యాయం జరిపించాలని పవన్ ఈ రోజు ఆందోళన చేయడం తెలిసిందే. పవన్ తల్లిని ఉద్దేశించి శ్రీరెడ్డి ఓ బూతుమాట అనడంతో గొడవ మొదలైంది.