బాలక్రిష్ణని సరికొత్తగా చూపెట్టిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షో సంచలనాలని సృష్టిస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలు అన్ స్టాపబుల్ సెట్స్ లో సందడి చేయగా.. నేడు మరో పెను సంచలనానికి తెరతీసింది ఆహ. ఎప్పటినుండో వస్తున్న కథనాలని నిజం చేస్తూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సెట్స్ లోకి అడుగుపెట్టాడు. అన్నపూర్ణ స్టూడియోలో వేలాది మంది అభిమానుల ఈలలు, కేకల నడుమ కారు దిగి బాలక్రిష్ణని హగ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు అగ్ర హీరోలని ఒకే ఫ్రెమ్ లో చూసిన నందమూరి, మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం 11గంటలకి అన్నపూర్ణ స్టూడియోకి వస్తున్నాడన్న సమాచారంతో పెద్ద ఎత్తున పవర్ స్టార్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. సెట్స్ లోపలికి వెళ్లేందుకు వారంతా చేయని ప్రయత్నాలు లేవు. కానీ ఈ అరుదైన షోని కళ్లారా చూసేందుకు సెలబ్రెటీలే క్యూ కట్టిన పరిస్థితి. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్,క్రిష్, నిర్మాత నాగవంశీ ఈ షోని చూడడానికి రాగా.. బాలకృష్ణ ఫ్యామిలీ సైతం సెట్స్ కి వచ్చారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని, చిన్నల్లుడు శ్రీభరత్ లు పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూసిన పరిస్థితి.
ఇలా సెలబ్రెటీల్లోనే పోటీ ఉండటంతో అభిమానులని సెట్స్ లోకి అనుమతించలేదు ఆహ నిర్వాహకులు. దీంతో ఫ్యాన్స్ అంత స్టూడియోలోనే పడిగాపూలు కాస్తూ నినాదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాగానే.. సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో అన్నపూర్ణ స్టూడియో హోరెత్తిపోయింది. బాబులకే బాబు పవన్ కళ్యాణ్ బాబు అంటూ మెగా డై హార్డ్ ఫ్యాన్స్ కేకలు వేశారు. ఇక సెట్స్ లోపల సైతం ఇదే పరిస్థితి ఉందని టాక్. బాలకృష్ణ ప్రశ్నలకి అడ్డుపడుతూ. .సెట్స్ లోపల అభిమానులు నినాదాలు చేస్తున్నారట. ఇక బౌన్సర్ల సహాయంతో లోపల అల్లరి చేస్తున్న కొందరు ఫ్యాన్స్ ని బయటికి పంపినట్టు సమాచారం. అలాగే షో మధ్యలో సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొంటారని మరో తాజా సమాచారం. ఇక షూటింగ్ కి వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ షోలో పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ టాక్ షోకి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో భారీ పోస్టర్ను ఆవిష్కరించారు అల్లు అరవింద్. అన్స్టాపబుల్ 2 షోలో NBK with PSPK అనే పోస్టర్ను ఇద్దరు ఫోటోలతో చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరించగానే అభిమానులు భారీగా కేకలు పెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు వేడుకల్లో షారూఖ్ ఖాన్ సందడి..వీడియో వైరల్
భగభగ మండే వాల్తేరు వీరయ్య.. టైటిల్ సాంగ్ వచ్చేసింది