టాలీవుడ్లో పవన్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ఆయన నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఎంతంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్, పవన్ కల్యాన్ కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుంది. త్వరలోనే సెట్స్‌పైకి సినిమాను తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు.
ఈ సినిమాకి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. అందుకు సంబంధించిన ఫస్టు పోస్టర్‌ను కూడా వదిలారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చనున్నాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ‘ప్రొఫెసర్’ పాత్రలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తుంది. దాదాపుగా అదే పాత్ర ఫిక్స్ అవుతుందని చిత్రబృందం తెలిపింది.
మరోపక్క ‘భీమ్లా నాయక్’ సినిమాతో హిట్ కొట్టిన పవన్ కల్యాణ్, తాజా షెడ్యూల్ షూటింగు కోసం ‘హరి హర వీరమల్లు’ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈనెల 18వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ మొదలవుతుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ అలరించనుంది. ‘భవదీయుడు భగత్ సింగ్’లో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. హరీశ్ శంకర్‌తో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది. ఇదివరకే పవన్ కల్యాన్ – హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత హిట్ట్ అయిందో తెలిసిందే.