Pawan Kalyan asked nine questions to YCP
mictv telugu

వైసీపీకి పవన్ కల్యాణ్ ‘నవ సందేహాలు’

July 8, 2022

Pawan Kalyan asked nine questions to YCP

ప్లీనరీ పేరుతో ఘనంగా పార్టీ సభ నిర్వహించుకుంటున్న వైసీపీకి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నవ సందేహాల పేరిట ప్రభుత్వాన్ని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న పలు పథకాలపై ఆయన తనదైన శైలిలో ప్రశ్నలను సంధించారు. అవి

1. రైతు భరోసా : 50 లక్షల మందికి ఇచ్చి 64 లక్షల మందికి ఇచ్చామని చెప్పుకుంటున్నారు. మూడు వేల మంది రైతులు చనిపోతే నష్టపరిహారం 700 మందికి మాత్రమే ఇచ్చారు.

2. అమ్మఒడి : 83 లక్షల మందికి ఇచ్చామని చెప్పి 43 లక్షల మందికే ఇచ్చారు. ఎందుకు అబద్ధమాడుతున్నారు.

3. పెన్షన్లు : ఈ జాబితాలో నుంచి 5 లక్షల మందిని తొలగించారు.

4. మద్యపాన నిషేధం : మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అలా చేయకుండా దానిపై రికార్డు స్థాయిలో ఆదాయం ఆర్జించారు. అంతేకాక, ఈ ఆదాయాన్ని చూపి రూ. 8 వేల కోట్లు అప్పు తీసుకున్నారు.

5. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలి

6. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్న ఆసుపత్రులు వెళ్లిపోతున్నాయి. వాటి బకాయిలు ఎందుకు చెల్లించట్లేదు

7. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదని కాలేజీలు విద్యార్ధులకు హాల్ టిక్కెట్లు ఇవ్వడం లేదు

8. ఇళ్ల స్థలాలను చెరువులు, గుట్టలలో ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం లేదు

9. లబ్దిదారులైన మహిళల సంఖ్యను విపరీతంగా తగ్గించేస్తున్నారు. అభయహస్తం డబ్బులు రూ. 2 వేల కోట్లు ఎటు పోయాయి అంటూ ప్రశ్నించారు.