చంద్రబాబు మాటలకు పగలబడి నవ్విన పవన్ కళ్యాణ్ - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబు మాటలకు పగలబడి నవ్విన పవన్ కళ్యాణ్

October 19, 2022

Pawan Kalyan burst out laughing with Chandrababu’s words

ఏపీలో విశాఖలో జరిగిన పరిణామాల తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్‌కి సానుభూతి తెలియజేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో సమావేశమయ్యారు. ఇటీవల ఘటనల నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు సంఘీభావం తెలిపారు. ఈ భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ, ప్రతిపక్షాలను లెక్కలేనితనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విపక్షంలేదు, రెండో ప్రతిపక్షమైన జనసేన లేదు… ఏ పార్టీని లెక్క చేయకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. మీడియాను కూడా పరిగణనలోకి తీసుకోవడంలేదని, కులాలు, ప్రాంతాల రంగు పులుముతున్నారని అన్నారు. మానసికంగా, శారీరకంగా, నైతికంగా ఎన్నిరకాలుగా విమర్శించాలో అన్ని రకాలుగా విమర్శిస్తున్నారు. మీరూ మనుషులేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంలో చంద్రబాబు మాటలకు పవన్ కళ్యాణ్ పగలబడి నవ్వారు. సినిమాల్లో హీరోగా ఉన్న పవన్‌కు ఇలా బూతులు తిట్టించుకోవడం అలవాటు లేదనగానే జనసేనాని పెద్దగా నవ్వారు. సినిమాల్లో హీరోగా ఎప్పుడూ తిట్టించుకునే అలవాటు లేని పవన్‌ కల్యాణ్‌.. రాజకీయాల్లోకి వచ్చి మాటలు పడుతున్నారన్నారు. ఆ వెంటనే చంద్రబాబు‘నాకు ఓపిక ఎక్కువ అంటారు. అటువంటి నేనే వీళ్ల వ్యవహారాలు చూసి భరించలేక బరస్ట్‌ కావాల్సి వచ్చింది’అన్నారు. . ఇప్పుడు ఆయన వంతు వచ్చింది, రేపు ఎవరి వంతు వస్తుందో తెలియదు. ఇదీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు మాటలకు పవన్ కల్యాణ్ పగలబడి నవ్వారు. దాంతో, సీరియస్ గా సాగుతున్న ప్రెస్ మీట్ లో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. చంద్రబాబుతో సహా, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అందరి ముఖాల్లో నవ్వులు కనిపించాయి.