కోనసీమ జిల్లా పేరు మార్పు అంశంపై జరిగిన హింసాత్మక అల్లర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా గొడవలు పెట్టిందని ఆరోపించారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి శుక్రవారం విజయవాడ వచ్చిన పవన్ కాసేపు మీడియాతో మాట్లాడారు. ‘అల్లర్లపై నిఘా విభాగం సమాచారం ఎందుకు ఇవ్వలేదు.
గొడవలు జరుగుతాయని ప్రభుత్వానికి ముందే తెలుసు. అందుకే గొడవలు జరిగి ఇన్నిరోజులైనా పాలకులు అల్లర్లపై స్పందించలేదు. వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విరుద్ధ విధానాలతో గొడవలు పెరిగాయి. సమస్య అంబేద్కర్ పేరు కాదు. ఒకే పార్టీలోని రెండు వర్గాల మధ్య ఉన్న గొడవే అసలు కారణం. భిన్నాభిప్రాయాలను తొక్కిపెట్టి అల్లర్లను రేపారు. దీనికి మంత్రి విశ్వరూప్‌ను బలి చేశార’ని వ్యాఖ్యానించారు.