Pawan Kalyan Congratulates chiranjeevi For Receiving Indian Film Personality Of The Year Award
mictv telugu

హీటెక్కిస్తున్న చిరంజీవి పవన్ కళ్యాణ్ ల చాటింగ్

November 21, 2022

జనసైనికులు ఎప్పటి నుండో మెగా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ కి అన్నయ్య చిరంజీవి ప్రత్యక్ష మద్దత్తు ఉంటే పరిణామాలు ఇంకోలా ఉంటాయని వారి నమ్మకం. అయితే చిరంజీవి మాత్రం రాజకీయాలకు దూరంగా కేవలం సినిమాలపైనే దృష్టి సారిస్తున్నారు. ఆయన ఎలాగో ఇప్పట్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారు. అయితే తన ప్రమేయం లేకుండానే రాజకీయాలని ప్రభావితం చేయగలిగే సత్తా చిరంజీవికి ఉంది. అందుకే ప్రధాన మంత్రి మోదీ సైతం మెగాస్టార్ కి ఎనలేని గౌరవం ఇస్తారు. పక్కన సీఎం ఉన్నా చిరంజీవికే మోదీ ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఆయన ఫ్యాన్స్, సామజిక వర్గం చిరంజీవిని దేవుడిలా కొలుస్తారు. ఆయన సేవలకు కామన్ పీపుల్ సైతం మెచ్చుకుంటారు. అలాంటి మెగా ఆశీస్సులు జనసేనకు ఉంటే తిరుగుండదు. అందుకే చిరంజీవిపై సందర్బోచిత వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయాలను హీటెక్కిస్తుంటాడు. చిరుని బీజేపీలోకి లాగాలని కేంద్రం విశ్వప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో తాజాగా మెగాస్టార్, పవర్ స్టార్ మధ్య జరిగిన సోషల్ మీడియా సంభాషణ చర్చనీయాంశం అవుతుంది.

 

వ్యక్తిగతంగా కాకుండా జనసేన అకౌంట్ నుండి పవన్ చిరంజీవిని ప్రశంసించటం, వీరి చాటింగ్ లో ఇంపార్టెంట్ మ్యాటర్. చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డు దక్కింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు చిరంజీవిని ప్రశంసిస్తున్నారు. అందరు తమ వ్యక్తిగత అకౌంట్స్ నుండి విషెష్ చెప్తే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన అఫీషియల్ అకౌంట్ నుండి అన్నయ్యకి కంగ్రాట్స్ చెప్పారు. ‘అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022’ పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే తమ్ముడికి వెంటనే రిప్లై ఇచ్చాడు చిరంజీవి. జనసేన ట్వీట్‌లోని పవన్ కళ్యాణ్ మాటలకు చిరంజీవి స్పందిస్తూ.. ‘నా ప్రియమైన పవన్ కళ్యాణ్ అందించిన ప్రేమాభినందనలకు కృతజ్ఞతలు’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.