పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం కొండగట్టు అంజన్న దర్శనం చేసుకున్నారు. తన కొత్త ప్రచార వాహనం వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ధర్మపురి వెళ్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకొని పూజలు చేశారు. అనంతరం హైదరాబాద్ బయల్దేరి వెళ్లగా, ఈ క్రమంలో పవన్ కాన్వాయ్‌ని అభిమానులు ఫాలో అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కాన్వాయ్ వెంట వెళ్తూ నలుగురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇందులో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోగా, మిగిలిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్ రావు పేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు ధర్మపురి మార్చురీకి తరలించారు. అటు వారాహికి పూజలు చేసిన అనంతరం పవన్ దానిపై నుంచి తొలి ప్రసంగం చేశారు. అలాగే ధర్మపురి ఆలయం నుంచి ‘అనుష్టుప్ నారసింహ యాత్ర’కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దశలవారీగా 31 నారసింహ క్షేత్రాలను దర్శించుకోనున్నారు.
వారాహిపై మొదటి ప్రసంగం 🔥🔥@JanaSenaParty @PawanKalyan#JanaSenaChaloKondagattu pic.twitter.com/UCOqQER0Qv
— Prasannakumar Nalle (@PrasannaNalle) January 24, 2023