Pawan Kalyan criticized the YCP government over visakha incident
mictv telugu

వైసీపీ కోరుకుంది మేం ఇవ్వలేం.. పవన్ కల్యాణ్ ఫైర్

October 17, 2022

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విశాఖలో జరిగిన పరిణామాలపై మండిపడిన ఆయన.. ఈ ప్రభుత్వం కోరుకున్న హింసను తానివ్వలేనని స్పష్టం చేశారు. విశాఖ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు.

ఆయన మాటల్లోనే.. ‘ఇప్పటికే రెండు సార్లు రాజధాని విషయంలో నష్టపోయాం. ఇప్పుడు అంతర్గత కుమ్ములాటతో మరోసారి స్వయంగా నష్టం చేసుకుంటున్నాం. కుల గొడవలతో రాష్ట్రం నిస్సారమైపోతోంది. అధికారంలో ఉన్న పార్టీ గర్జించడమేంటి? ఇతర పార్టీలను భయపెట్టి అదుపులో ఉంచాలని అధికారిక వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే 105 మంది జనసైనికులపై క్రిమినల్ కేసులు పెట్టారు. మూడు రాజధానులు ముందుకు వెళ్లడం లేదనే అక్కసుతో పోలీసులను ఉపయోగించి కేసులు బనాయిస్తున్నారు. భూ అక్రమాలు బయటపడతాయనే జనవాణిని అడ్డుకున్నారు. రాయలసీమ నుంచి ఇంత మంది సీఎంలు వచ్చినా అభివృద్ధి చేయలేదు. అధికారం అంతా ఓ కుటుంబం చేతిలో పెట్టుకొని వికేంద్రీకరణ అంటున్నారు. ఈ ధోరణి భవిష్యత్ తరాలకు మంచిది కాదు. వైసీపీ ముక్త రాష్ట్రమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో పని చేస్తామ’ని వ్యాఖ్యానించారు.