జనసేనాని సాయం.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 2 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

జనసేనాని సాయం.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 2 కోట్లు

March 26, 2020

Pawan Kalyan Donates 2 Crore Rupees   

జనసేనాని పవన్ కల్యాన్ కరోనా మహమ్మారిపై యుద్ధం మొదలుపెట్టారు. ప్రతిక్షణం ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రధాని మోదీ ఆదేశాలను పాటించాలని సూచించారు. ఇలా కేవలం మాటలు చెప్పడం వరకు మాత్రమే కాకుండా ప్రభుత్వాలకు తన వంతు సాయం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి రూ. 2 కోట్ల విరాళంగా ఇస్తున్నట్టుగా చెప్పారు. ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశాన్ని కలవరపెడుతున్న ఈ మహమ్మారిని అంతా కలిసి ధీటుగా ఎదర్కోవాలని పిలుపునిచ్చారు. 

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ. 50 లక్షల చొప్పున, ప్రధాని సహాయనిధికి రూ. కోటి ప్రకటించారు. త్వరలోనే ఈ విరాళాలు అందిస్తానని పేర్కొన్నారు. వైరస్‌పై పోరాటంలో భాగంగా కావల్సిన నిధులకు తాను ఇచ్చే సాయం చేయూతగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు. ప్రధాని ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 14 వరకూ స్వీయ గృహ నిర్భందంలో ఉండాలని అప్రమత్తం చేశారు. పవన్ నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే బాటలో మిగితా సెలబ్రెటీలు, ప్రజా ప్రతినిధులు ముందురు రావాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.