హైదరాబాద్ వరదలు.. పవన్ కళ్యాణ్ భారీ విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ వరదలు.. పవన్ కళ్యాణ్ భారీ విరాళం

October 21, 2020

Pawan Kalyan Donates Rs 1 Crore to Telangana CM Releaf Fund

హైదరాబాద్‌ వరద బాధితులను ఆదుకోవడానికి టాలీవుడ్ తారలు ముందుకు వస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం ప్రకటించారు. ఇప్పటికే నటులు చిరంజీవి, మహేష్ బాబులు చెరో కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెల్సిందే. 

అలాగే నాగార్జున రూ. 50 లక్షలు, ఎన్టీఆర్ రూ. 50 లక్షలు ప్రకటించారు. విజయ్ దేవరకొండ రూ. 10లక్షల విరాళం ప్రకటించారు. త్రివిక్రమ్ రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. అనిల్, హరీష్ శంకర్ చెరో రూ. 5లక్షల విరాళం ప్రకటించారు. అలాగే దాతలు అందరు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించాలని కోరుతున్నారు. విరాళాలు ప్రకటిస్తున్న వారికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కృతఙ్ఞతలు తెలిపారు.