నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ టాక్ షోకి పవన్ కళ్యాణ్ రాబోతున్నారన్న కథనాల్ని నిజం చేస్తూ.. నేడు పవర్ స్టార్ అన్నపూర్ణ స్టూడియోలో అడుగుపెట్టాడు. వేలాది మంది అభిమానుల హర్షాతిరేకాలు మధ్య.. స్టైలిష్ గా కార్ దిగి బాలయ్యకి షేక్ హ్యాండ్ ఇచ్చి, అన్స్టాపబుల్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్. అయితే ఉదయం 11గంటలకి పవన్ కళ్యాణ్ వస్తాడన్న సమాచారంతో అన్నపూర్ణ స్టూడియో అంతా జనసైనికులతో నిండిపోయింది. పవన్ కనిపించగానే సీఎం సీఎం అంటూ నినాదాలు మారుమ్రోగాయి. ఇక పవన్ ఎంట్రీకి ముందు నుండే షూటింగ్ చూడడానికి పెద్ద ఎత్తున సెలబ్రెటీలు సైతం హాజరయ్యారు. భారీ సినిమా ఈవెంట్ జరుగున్నట్టు కోలాహలంతో ఈ ఇంటర్వ్యూ ని ప్లాన్ చేశారు ఆహ నిర్వాహకులు. అయితే పవన్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి బాలకృష్ణ తన చిన్న కూతురితో సహా సెట్స్ కి వచ్చాడు. ఒక హోస్టుగా అతిథి మర్యాద కోసం పవన్ వచ్చే వరకు ఎదురు చూశాడు బాలకృష్ణ.
పేరు తెలీదు అన్నోడే పడిగాపులు కాసేలా 🔥😂
Ustaad @PawanKalyan 😎 #UnstoppableWithNBKS2 #PSPKwithNBK https://t.co/qqEdECDXYM
— KB™ (@kboidhapu) December 27, 2022
అయితే పవన్ కోసం బాలయ్య ఎదురు చూడటాన్ని కొందరు వెటకారం చేయటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. సెట్లో పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య ఎదురుచూశాడు. అయితే ఇదే విషయాన్ని ఓ మెగా ఫ్యాన్ ట్వీట్ వేశాడు. “పేరు తెలీదు అన్నోడే పడిగాపులు కాసేలా చేశావ్ కదా?” అంటూ పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ వేశాడు. దీంతో నందమూరి అభిమానులు హర్ట్ అయ్యారు. అలా మళ్లీ మెగా వర్సెస్ నందమూరి అన్నట్టుగా సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. కొందరు ఫ్యాన్స్ కుంచిత మనస్తత్వం ఆహ్లాదకరమైన కార్యక్రమం పట్ల తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తుందని.. పవన్ రాక కోసం ఎదురు చూస్తున్న వీడియోని తీసుకుని కొంత మంది పవన్ అభిమానులు దీనికి విపరీత అర్థాలు తీయడం సరికాదని అంటున్నారు. ఒక హోస్టుగా గెస్టుకి ఎదురెళ్లి స్వాగతం చెప్పడం బాధ్యత. అది అతిధి మర్యాద. అంత మాత్రాన ఇంత వ్యతకారం అవసరంలేదంటూ నందమూరి అభిమానులు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కౌంటర్లు ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
పవన్ – బాలయ్యల సెట్స్ లో సెక్యూరిటీ లోపం.. భారీ గందరగోళం ?
భగభగ మండే వాల్తేరు వీరయ్య.. టైటిల్ సాంగ్ వచ్చేసింది
పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా సోహెల్ ?