సైనిక సంక్షేమం కోసం పవన్ రూ. కోటి - MicTv.in - Telugu News
mictv telugu

సైనిక సంక్షేమం కోసం పవన్ రూ. కోటి

December 6, 2019

Pawan

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  సైనిక సంక్షేమ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించారు. మన ప్రియమైన ప్రధానమంత్రి, గౌరవనీయ నరేంద్ర మోదీ అని సంబోధించి పవన్ ట్వీట్ చేశారు. ఒక కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘సాయుధ బలగాల కుటుంబాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్రీయ సైనిక్ బోర్డుకు ఉదారంగా విరాళాలు ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు మనమందరం సంఘీభావం ప్రకటించాలి’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.

రేపు సాయుధ బలగాల పతాక దినోత్సవం పురస్కరించుకుని పవన్ ఈమేరకు పిలుపునిచ్చారు. తనవంతుగా సైనిక సంక్షేమ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించారు. తానే స్వయంగా చెక్కులను  దీనికి సంబంధించిన అధికారులకు ఇస్తానని పేర్కొన్నారు. దేశం కోసం పౌరుల బాధ్యతను గుర్తుచేస్తున్న ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని మరో ట్వీట్ చేశారు. ప్రస్తుతం పవన్ ట్వీట్ చాలా ఆసక్తిగా మారింది. 

కాగా, ఈమధ్య పవన్ నోటివెంట తరచుగా బీజేపీ, దాని అగ్ర నాయకుల పేర్లు బాగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. రాయలసీమ పర్యటనలో కొన్ని సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్‌ను సైతం తన ప్రసంగంలో ప్రస్తావించారు.