అక్రమ లీజుపై స్పందించిన పవన్ కల్యాణ్ - MicTv.in - Telugu News
mictv telugu

అక్రమ లీజుపై స్పందించిన పవన్ కల్యాణ్

December 15, 2017

గుంటూరు జిల్లా చినకాకానిలో పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం జనసేన అక్రమంగా లీజు తీసుకుందన్న ఆరోపణంపై నటుడు పవన్ కల్యాణ్ ఎట్టకేలకు స్పందించాడు. లీజుకు తీసుకున్న స్థలం విషయంలో గొడవలు, వివాదాలు, అక్రమాలు ఉన్నట్లు తేలితే రద్దు చేసుకుంటామన్నారు.

చట్టం, న్యాయంపై తమకు ఎంతో గౌరవం ఉందని ఆయన  ఓ ప్రకటనలో తెలిపారు. ఈ  స్థలం లీజుపై అంజుమన్‌ ఇస్లామిక్‌ కమిటీ సభ్యులు చేసిన ఆరోపణలు తన  దృష్టికి వచ్చాయన్నారు. ఈనెల 8, 9 తేదీల్లో తాను విజయవాడలోనే ఉన్నాని, ముస్లింలు అప్పుడే తన వద్దకు రావాల్సి ఉండిందని అన్నారు. అప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు ఓ రాజకీయనేత అండతో దీనిపై మాట్లాడడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.ఈ స్థలాన్ని కేవలం మూడేళ్లకే లీజుకు తీసుకున్నామన్నామని వివరణ ఇచ్చారు.  స్థలం ముస్లింలదని నిర్ధరణ అయితే అక్కడి నుంచి వెంటనే తప్పుకుంటామన్నారు. సర్వే నెంబరు 182/1, 181లోని 10 ఎకరాల భూమిలో జనసేన మూడెకరాలను  లీజుకు తీసుకుంది. అయితే అది లీజుకు  ఇచ్చిన రైతు యార్లగడ్డ సుబ్బారావుది కాదనీ,  తమది అని ముస్లింలు అంటున్నారు.