సాధారణంగా మొదలై సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్‌స్టాపబుల్. AHAలో విడుదలవుతున్న ప్రతి ఎపిసోడ్‌తో షోకి క్రేజ్ పెరుగుతూనే పోతుంది. దీనికి ముఖ్య కారణం బాలయ్యా మ్యాజిక్ తో పాటు షోకి వచ్చే గెస్టులు కూడా. బిగ్ బాస్ మాదిరి ఊరు పేరు లేనివాళ్ళని కాకుండా స్టార్ స్టేటస్ ఉన్న వారు మాత్రమే షోకి వస్తుండటంతో ఆడియన్స్ భారీగా ఆసక్తి కనపరుస్తున్నారు. మహేష్ బాబు నుండి మొదలు పెడితే.. నాని, రవితేజ, విజయ్ దేవరకొండ, చంద్రబాబు, గోపీచంద్, ప్రభాస్ లు అన్‌స్టాపబుల్ షోలో తళుక్కుమన్నారు. ఇక లేటెస్ట్ గా ఈ సెకండ్ సీజన్ ఆఖరి ఎపిసోడ్ ని పవన్ కళ్యాణ్ తో ముగించనున్నారని ఎప్పటి నుండో వార్తలొస్తున్నాయి. ఇక తాజాగా దీనిపై ఒక క్లారిటీ వచ్చేసింది. అన్‌స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యిందని టాక్. షూటింగ్, స్ట్రీమింగ్ డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయాయని అంటున్నారు.
సాధారణంగా ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ త్వరలో బాలయ్య టాక్ షోలో పాల్గొననున్నాడని, అతని ఎపిసోడ్ స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ అయిపోయిందని లీకులోస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ని తన మూడు పెళ్లిళ్ల గురించి బాలకృష్ణ ఆగడనున్నారని సైతం పుకార్లు వస్తున్నాయి. డైరెక్టర్ క్రిష్ తో పాటు పవన్ షోకి రానున్నాడట. పవన్ కళ్యాణ్, క్రిష్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయాలని ఆహా వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ ఎపిసోడ్ తోనే రెండో సీజన్‌కు శుభం కార్డు వేస్తారట. ఫస్ట్ సీజన్లో మొత్తం పది ఎపిసోడ్స్ చేశారు. ఇప్పుడు రెండో సీజన్లో ఇప్పటి వరకు ఆరు ఎపిసోడ్స్ వచ్చాయి. ప్రభాస్, గోపీచంద్ సందడి చేసింది ఏడో ఎపిసోడ్. అది న్యూ ఇయర్ కానుకగా విడుదల కానుంది. దానికి, పవన్ ఎపిసోడ్‌కు మధ్య మరో రెండు వస్తాయో? లేదంటే ఒక్కటి వస్తుందో? చూడాలి.