రైతులకు రూ. 5 వేల పింఛన్.. జనసేన హామీ - MicTv.in - Telugu News
mictv telugu

రైతులకు రూ. 5 వేల పింఛన్.. జనసేన హామీ

March 14, 2019

ఎన్నికల దగ్గర పడుతుండడంతో పార్టీలు హడావుడి పెంచేశాయి. అభ్యర్థులు జాబితాలు, హామీలతో హోరెత్తిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేస్తామని ఏపీలో పోటీ చేస్తున్న జనసేన ప్రకటించింది. ఈ రోజు రాజమండ్రిలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకలో అధినేత పవన్ కల్యాణ్ ఎన్నిక మేనిఫెస్టో వివరాలను వెల్లడించారు.

Pawan kalyan janasena electons manifesto promises announced rajamahendravaram Rajahmundry party first anniversary  .

తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్యబీమా కల్పిస్తామని తెలిపారు. రైతులకు ఉచితంగా సోలార్‌ పంపుసెట్లు ఇస్తామని ప్రకటించారు. రైతులకు ప్రతి కరాకు రూ.8 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని, 60 ఏళ్లు దాటిన సన్నకారు రైతులకు నెలకు రూ.5 వేలు పెన్షన్‌ ఇస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని, ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును శీఘ్రగతిలో పూర్తిచేస్తామని హామీ చ్చారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించి, లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.