పవన్ కల్యాణ్‌కు రెండు పిట్టలు:  కత్తి మహేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్‌కు రెండు పిట్టలు:  కత్తి మహేశ్

December 6, 2017

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను విమర్శించి వార్తల్లోకి ఎక్కిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మళ్లీ పవన్‌ను ఉద్దేశించి మళ్లీ వ్యాఖ్యలు చేశారు. పవన్ విశాఖ పర్యటనపై స్పందించారు.  ‘పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘అజ్ఞాతవాసి’ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో త్వరలో ఉంది.

మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. ‘ఏక్ పంత్ దో కాజ్’ అంటే..  ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అటు పవన్‌కు  రాజకీయపరంగా లాభముంటుంది.  ఇటు సినిమా పరంగా ప్రమోషన్ కూడా జరిగిపోతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడం  తప్పు కాదు. అసలే సమయం తక్కువగా ఉంది. రెండింటికి పనికొచ్చే పని చేస్తుంటే అంతకన్నా ఏం కావాలి?  పవన్ కల్యాణ్ ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా, ఆయన జనాల్లోకి వెళుతున్నారు…  జనాల్లోకి వెళ్లడం కల్యాణ్‌కు   రెండు రకాలుగానూ ఉపయోగపడుతుంది.. ’ అని అన్నారు.

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ సంస్థ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనతో పవన్ పాల్గొన్నారు బుధవారం. తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన విశాఖలో మూడు రోజులు తిరుగుతారు.