తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది.. పవన్ కల్యాణ్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది.. పవన్ కల్యాణ్

March 23, 2018

తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసల జల్లులు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. హామీల అమలు, ప్రజాసంక్షేమంలో అందరూ కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన హార్డ్ వర్కర్, స్మార్ట్ సీఎం అని కితాబిచ్చారు జనసేనాని. అయతే ఏమైందో ఏమోగాని టక్కున మాట మార్చేశారు. ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు తెలంగాణ ప్రభుత్వం కూడా విఫలమైందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య స‌మ‌రయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ వర్ధంతిని పురస్కరించుకుని విడుదల చేసిన ప్రకటనలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ వీరుల స్ఫూర్తితో ఏపీ ప్రయోజనాల కోసం పోరాడాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్‌ల త్యాగాలు లక్షల మంది మనసుల్ని జ్వలింపచేశాయనిన్నారు. ‘వారి ఆత్మార్పణను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని యువత ఈ రోజు స్మరించుకుంది. ఆర్థికంగా మెరుగైన పరిస్థితుల్ని తీసుకురావడంలో రెండు ప్రభుత్వాలూ విఫలం కావడంపై వారి స్పూర్తితో పోరాడుతుంది‘ అని అన్నారు.

ఇటీవల తెలుగు రాష్ర్టాల సీఎం పనితీరుకు పవన్ మార్కులు వేయడం తెలిసిందే. కేసీఆర్‌కు 6 మార్కులు, చంద్రబాబుకు 2.5 మార్కులు వేశారు. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ప్రజల సంక్షేమంలో ఎంతగానో పాటుబడుతోందని కొనియాడారు.