విశ్వక్సేన్, అర్జున్ కూతురుల సినిమాను ప్రారంభించిన పవన్ కల్యాణ్ - MicTv.in - Telugu News
mictv telugu

విశ్వక్సేన్, అర్జున్ కూతురుల సినిమాను ప్రారంభించిన పవన్ కల్యాణ్

June 23, 2022

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురువారం రామానాయుడు స్టూడియోలో ఓ కొత్త చిత్రానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. అనంతరం చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ అంటూ విష్ చేశారు. యంగ్ హీరో విశ్వక్ సేన్, యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోహీరోయిన్లుగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు అర్జునే కావడం విశేషం. ఇదే కాకుండా ఈ కార్యక్రమలో మా అధ్యక్షులుగా పోటీ పడిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు కూడా పాల్గొన్నారు. వారిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఫోటోలు బయటికి వచ్చాయి. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రానికి కేజీఎఫ్ సిరీస్ సినిమాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. జగపతిబాబు కీలక పాత్రలో నటించే ఈ సినిమాకు మాటల రచయితగా సాయి మాధవ్ బుర్రా పనిచేయనున్నారు. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, స్వంత కూతురిని హీరోయిన్‌గా పెట్టి తండ్రి అర్జున్ దర్శకుడిగా వ్యవహరించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.