కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం జనసేన ఆవిర్భావసభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసారు జనసేన అధినేత పవన్ కల్యాన్. తనకు క్షేత్రస్థాయిలో సంపూర్ణ మద్దతు ఉన్నట్లు రుజువైతే జనసేన ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచేందకు సిద్ధమంటూ ప్రకటించారు. తనకు గజమాలలు,పూలమాలలు వద్దు ఓట్లు వేస్తే చాలని కోరారు. గతఎన్నికల్లో బలమైన నేత దేశానికి కావాలన్న ఉద్దేశ్యంతోనే మోదీకి మద్దతు పలికినట్లు పవన్ తెలిపారు. మోదీ మద్దతు ప్రకటించగానే.తనను చాలామంది వెటకారం చేశారంటూ దుయ్యబట్టారు.
అప్పట్లో బీజేపీ తెలియదని…కేవలం మోదీ మాత్రమే తెలుసంటూ వ్యాఖ్యానించారు. పాతిక సీట్లు ఇస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు. మెడలు వంటి దండాలు పెడుతున్నారంటూ జగన్ పై సెటైర్లు వేశారు పవన్. హోదా కోసం ఉద్యమం చేద్దామనుకుంటే ఓడింటి తూట్లు పొడిచేశారని…తనను ఒంటరి చేశారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హోదా కోసం తాను ఎంతో ఇష్టపడిన మోదీని కూడా ఎదురించినట్లు పవన్ చెప్పుకొచ్చారు.
బీజేపీ నేతలు తాను అనుకున్నట్లుగా అన్ని కార్యక్రమాలు జరగనిస్తే…బీజేపీ, జనసేనలు అధికారంలో ఉండేవన్నారు. టీడీపీ పార్టీ పై ఎలాంటి ఎక్స్ట్రా ప్రేమ లేదన్నారు. టీడీపీతో 20 సీట్ల గురించి తాను మాట్లాడలేదంటూ స్పష్టం చేశారు. జనసేన ఈసారి బలిపశువు కాదని..ప్రయోగాల జోలికి అస్సలు వెళ్లదని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా ప్రణాళి ఉంటుందన్న పవన్..తమ వద్ద డబ్బులు లేవన్నారు.